Bigg Boss : సీజన్-8 మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు?
on Oct 2, 2024
బిగ్ బాస్ సీజన్-8 లో ప్రతీవారం కొత్త నామినేషన్లు, కొత్త టాస్క్ లు జరుగుతున్నాయి. ఇక హౌస్ లో మొత్తంగా పది మంది ఉన్నారు. వీరిలో ఎవరి ఆట బాగుంది.. ఎవరు అనర్హులు.. ఎవరు ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ అవుతారు.. ఎవరు వీకెండ్ ఎలిమినేషన్ అవుతారనేది ఓ సారి చూసేద్దాం. (Bigg Boss Telugu 8)
హౌస్ లో ఇప్పటివరకు జరిగిన వారాల్లో నబీల్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. వచ్చిన ప్రతీ టాస్క్ లో తన 100% ఇస్తూ వస్తున్నాడు. అలాగే ఆదిత్య ఓం తన ఆటతీరుని మెరుగుపర్చుకున్నాడు. నిన్నటి టాస్క్ లో చాలా ఫాస్ట్ గా బాల్స్ బాస్కెట్ లో పడేశాడు. నిఖిల్ తన రాంగ్ డెసిషన్స్ తో బోల్తా పడుతున్నాడు. మొదటి రెండు వారాలు నిఖిల్ ని చూసి విన్నర్ ఇతనే అనుకున్నారంతా కానీ సోనియా చెప్పుడు మాటలకి తను ఆడే ఇండివిడ్యువల్ ఆటని మర్చిపోయాడు. దాంతో అతనికి ఓటింగ్ కూడా లేకుండా పోయింది. ఇక తాజాగా జరుగుతున్న ఓటింగ్ ప్రక్రియలో కూడా మొదటగా నబీల్, రెండవ స్థానంలో విష్ణుప్రియ ఉండగా మూడవ స్థానంలో నిఖిల్ ఉన్నాడు. సాధారణంగా అయితే నిఖిల్ మొదటి స్థానంలో ఉంటాడు. మరి ఇక ముందు జరిగే టాస్క్ లలో నిఖిల్ తన ఆటని మెరుగుపరుచుకుంటాడో చూడాలి మరి.
ఇక సోనియా వెళ్ళిపోయాక యష్మీ చేరింది. నిఖిల్, పృథ్వీలకి లేనిపోనివి కల్పించి చెప్తూ వస్తోంది. తనలో ఉన్న సైకోయిజాన్ని మళ్ళీ బయటకు తెస్తుంది. ఇక ప్రేరణ ఆటల్లో ముందుకు రాలేకపోతుంది. కిర్రాక్ సీత క్లాన్ చీఫ్ అయిన కారణంగా తమ టీమ్ అందరి ఒపినీయన్ తీసుకొని తను ఆడకుండా సాక్రిఫైజ్ చేస్తోంది. ఇక ఈ వారం నామినేషన్ లో లేదు కాబట్టి పెద్దగా పర్వాలేదు కానీ టాస్క్ లు ఆడితేనే అటు హౌస్ మేట్స్ , ఇటు ఆడియన్స్ గుర్తిస్తారనేది వాస్తవం. నాగ మణికంఠ సంచాలక్ గా బాగా చేస్తున్నాడు. అయితే గేమ్ లో సరిగ్గా ఏకాగ్రతతో ఆడలేకపోతున్నాడు. నైనిక ఇంకా చిన్నపిల్లలాగే ఉంటుంది. మొదటి రెండు వారాల్లో ఉన్న ఫైర్ ఇప్పుడు లేదు. విష్ణుప్రియ గేమ్స్ లో లైట్ తీస్కుంటుంది. అయితే నిన్నటి స్విమ్మింగ్ పూల్ టాస్క్ లో బాగానే ఆడింది. పృథ్వీ అగ్రెసివ్ అండ్ టెక్నిక్ తో బాగానే నెట్టుకొస్తున్నాడు. అయితే అతనకి తోటి కంటెస్టెంట్స్ చేత ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. ఛీఫ్ అయ్యే లక్షణాలు అసలే లేవు. ఇక ఇందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో.. హౌస్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరు అవుతారని అనుకుంటున్నారో.. వీకెండ్ ఎవరు ఎలిమినేషన్ అవుతారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Also Read